కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి : ఉత్తమ్ కుమార్

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనాను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన ఆస్పత్రి నుంచి ఓ వీడియోను విడుదల చేశారు. పేదలకు ఉచితంగా నాణ్యమైపన వైద్యం అందించాలని కూడా ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఇలా ప్రజలకు వైద్య సేవలు అందించడం ప్రభుత్వాల బాధ్యత అని కూడా గుర్తు చేశారు. కరోనా కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఇది చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో పడకలు దొరక్క, ఆక్సిజన్ లభ్యం కాక, రెమిడేసివిర్ ఇంజక్షన్లు కూడా లభ్యం కావడం లేదన్నారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు ప్రకటించారు.