నేటి నుంచి పాస్‍పోర్టు సేవలు…

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాస్‍పోర్టు సేవలును పునరుద్ధరిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‍పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. హైదరాబాద్‍లోని బేగంపేట, అమీర్‍పేట, టోలిచౌకితో పాటు నిజామాబాద్‍లోని పాస్‍పోర్టు సేవా కేంద్రాలు, కరీంనగర్‍లోని లఘు కేంద్రం, సికింద్రాబాద్ పాస్‍పోర్టు కార్యాలయంలోని పబ్లిక్ విచారణ కౌంటర్లు, బ్రాంచ్ సెక్రెటరీ కార్యాలయ సేవలు తిరిగి ప్రారంభిస్తున్నామన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.