ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక పరిణామం…
నందకుమార్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక పరిణామం చేసుకుంది. నందకుమార్ ఈడీ విచారణకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా ఎన్షోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రస్తుతం దూకుడు పెంచింది. మెయినాబాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేసిన ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, సెవెన్‌హిల్స్ మాణిక్‌చంద్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ అభిషేక్ ఆవాలను ఈడీ విచారించింది. నందకుమార్‌ను విచారణకు అనుమతించాలని నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను తాము పరిశీలించామని, అందులో రూ.వందల కోట్ల డిల్ గురించి చర్చింనందుకు మనీ లాండరింగ్‌కు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు ఈడీ అసిసెÊంట్ డైర్టెకర్ సుమిత్ గోయల్ (పిటినర్) పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. నందకుమార్‌ను ఒక రోజు విచారణకు కోర్టు అనుమతించింది. దీంతో ఎల్లుండి చంచల్‌గూడ జైలులోనే నందకుమార్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు.













