ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపీ కవిత
దేశంలో ఉత్తమ పార్లమెంటు సభ్యుల్లో ఒకరిగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా-ఆసియా పోస్ట్ మేగజైన్ నిర్వహించిన శ్రేష్ణ్ సంసద్ (ఉత్తమ పార్లమెంటేరియన్) సర్వేలో ఎంపిక చేసిన 25 మంది ఉత్తమ ఎంపీల జాబితాలో ఆమెకు స్థానం లభించింది. పార్లమెంట్‌కు హాజరు, చర్చల్లో భాగస్వామ్యం, ప్రశ్నలు అడగడం, సామాజిక సేవ, ప్రజలకు అందుబాటులో ఉండటం తదితర అంశాల ప్రాతిపదికన సర్వే నిర్వహించారు. ఈ నెల 31న ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో నిర్వహించనున్న కార్యక్రమంలో కవిత ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.













