బయో ఆసియా సదస్సును ప్రారంభించిన మంత్రి కేటీఆర్
దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 19వ ఎడిషన్ బయో ఆసియా సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధిలో బయో ఆసియా సదస్సు క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికి జీనోమ్ వ్యాలీ వెన్నెముఖగా నిలుస్తుందని స్పష్టం చేశారు. బిల్‌గేట్స్‌తో జరిగే చర్చ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
లైఫ్ సైన్సెస్ రంగంలో సుమారు 215 సంస్థల నుంచి రూ.6,400 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని తెలిపారు. ఇప్పటికే ఉన్న వాటితో పాటు కొత్తగా వచ్చిన సంస్థలతో ఏడాది కాలంలో 34 వేల మందికి ఉపాధి లభించిందన్నారు. జీవశాస్త్ర రంగాల్లో హైదరాబాద్ ఏ విధంగా ప్రభావం చూపుతోంది.. ఈ వృద్ధినే నిదర్శనమని తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ప్రోత్సాహం అందిస్తుందనేది స్పష్టమవుతోందని తెలిపారు. గతేడాదితో పోలిస్తే 200 శాతం వృద్ధి సాధించిందన్నారు.













