సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు : మహేశ్ బిగాల
ఉక్రెయిన్లో మెడిసిన్ చదివేందుకు వెళ్లి తిరిగి వచ్చిన తెలంగాణ విద్యార్థులను చదివిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించడంపై టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల హర్షం వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల రాష్ట్రానికి చెందిన 710 మంది మెడిసిన్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఇలాంటి ఆపత్కాలంలో విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించడం గొప్ప విషయమన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సీఎం కేసీఆర్, ఉక్రెయిన్ విద్యార్థులకు చదువుకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పడం గొప్ప విషయమన్నారు.













