మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు: కేటీఆర్
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ కోసం శ్రమించిన వారందరికీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మునుగోడులో గడిచిన నెల రోజులపాటు కష్టపడిన నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. “పార్టీ కోసం తమ తమ ప్రాంతాల నుంచి మునుగోడు వచ్చి, టీఆర్ఎస్ అందిస్తున్న సుపరిపాలన గురించి అక్కడి ప్రజలకు వివరించి, పార్టీ గెలుపు కోసం పనిచేసిన ఇంచార్జిలు, నాయకులు, వారితో వచ్చిన కార్యకర్తలకు సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు” అని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేసిన సోషల్ మీడియా వారియర్లకు కూడా పార్టీ తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు.













