మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్టాత్మకమైన ఆహ్వానం లభించింది. అబుదాబి భారత రాయభార కార్యాలయం దుబాయ్, యూఏఈలోని ప్రముఖ పారిశ్రామిక సంఘం బీజీనెస్ లీడర్స్ ఫోరమ్ నిర్వహించనున్న ఇండియా యూఏఈ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం లభించింది. ఈ సమావేశానికి భారతదేశంతో పాటు గల్ఫ్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అధికారులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు సుమారు 800 మంది పాల్గొననున్నారు. దుబాయ్, యూఏఈ దేశాలతో భారతదేశ వాణిజ్య, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సమావేశం నిర్వహిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ నెల 30, 31వ తేదీలలో దుబాయ్‌లో సమవేశం జరగనుంది. 30న మంత్రుల స్థాయి సెషన్లో పాల్గొనాల్సిందిగా మంత్రి తారకరామారావును నిర్వాహకులు కోరారు. ఈ సందర్భంగా ఇరు ప్రాంతాల మద్య ఉండాల్సిన వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్యం, పెట్టుబడులు, పాలసీలు టూరిజం వంటి అంశాలపై మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతో పాటు తెలంగాణలో ఉన్న పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ పారిశ్రామిక పాలసీలపై ప్రసంగించాలని కోరారు. ఇప్పటికే ఈ సమావేశంలో పాల్గొనాలని బీజీనెస్ లీడర్స్ ఫోరమ్ మంత్రికి ఆహ్వానాన్ని పంపింది.













