కోదండరామ్ సంచలన నిర్ణయం
తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీ అధినేత, ప్రోఫెసర్ కోదండరామ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మునుగోడులో జరుగుతున్న ప్రభుత్వ అక్రమాలు, ఎన్నికల నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుద్ద భవన్లోని ప్రధాన ఎన్నిక అధికారి కార్యాలయంలో కోదండరాం మౌన ప్రదర్శనకు దిగారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా విచ్చల విడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలు పూర్తిగా గాలికొదిలేశారని, రాజ్యంగ బద్ధంగా ఎన్నికలు జరుగాలని కోరారు.













