టీటీడీ బోర్డులో సభ్యత్వం కోసం ఎవరినీ సిఫారసు చేయలేదు : కిషన్ రెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో సభ్యత్వం కోసం తాను ఎవరినీ సిఫారసు చేయలేదని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కిషన్ రెడ్డి లేఖ రాశారు. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులు వై.రవిప్రసాద్ పేరును తాను సిఫారసు చేయలేదని తేల్చి చెప్పారు. వ్యక్తిగతంగా కానీ పర్యాటకశాఖ తరపున గానీ ఎవరినీ సూచించలేదని లేఖలో పేర్కొనారు. తన పేరును దుర్వినియోగం చేయడాన్ని ఖండించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని జగన్కు సూచించారు.













