కాంగ్రెస్ అధికారంలోకి వస్తే… దేశంలో మళ్లీ : కిషన్ రెడ్డి

దేశంలో స్థిరమైన పాలన కోసం బీజేపీని గెలిపించాలని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆయన జీప్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మతకలహాలు, అవినీతి కుంభకోణాలేనని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే, దేశంలో మళ్లీ కుటుంబ పాలన వస్తుందన్నారు.