ఉప ఎన్నిక లో గెలిస్తే … తెలంగాణకు నెక్స్ట్ సీఎం నేనే
మునుగోడు ప్రజలు తనపై ఎనలేని ప్రేమ చూపారని, ఉప ఎన్నిక లో గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి తానే తరువాయి ముఖ్యమంత్రినని కేఏ పాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్షా 10 వేల ఓట్లు ఉంగరం గుర్తుకు పడ్డాయని, తాను 50 వేల మెజారిటీతో గెలవబోతున్నానని ప్రకటించారు. తన గెలుపు రాష్ట్ర, దేశ రక్షణకు తొలి మెట్టని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో దుర్వినియోగానికి పాల్పడ్డారని, టీఆర్ఎస్ నేతలు తనపై మూడు సార్లు దాడికి యత్పించారని ఆరోపించారు. తన లాంటి యూత్‌కు కేసీఆర్ ఇచ్చే మెసేజ్ ఇదేనా? అని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో ఎన్నికల కమిషన్ పాల్‌కు ఉంగరం గుర్తు కేటాయించిన విషయం తెలిసిందే.













