జార్ఖండ్ ‘క్యాంపు’ పాలిటిక్స్
భూ కుంభకోణం తదితర కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేయడంతో జార్ఖండ్‌లో ప్రభుత్వం సంక్షోభం తలెత్తింది. రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ ప్రమాణస్వీకారం చేయగా.. అసెంబ్లీలో బల పరీక్ష ఈనెల 5వ తేదీన చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యే చేజారిపోకుండా క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. అయితే ఆ క్యాంపులు తెలంగాణకు మారాయి. జార్ఖండ్ ఎమ్మెల్యేలకు ఇక్కడి తెలంగాణ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది.
హైదరాబాద్‌లోని బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి శామీర్‌పేట్‌లోని లియోనియో రిసార్ట్‌కు జార్ఖండ్ ఎమ్మెల్యేలు తరలివచ్చారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఎమ్మెల్యేలను రెండు బస్సుల్లో రిసార్ట్‌కు తరలించారు. హైకమాండ్ ఆదేశాలతో…. హైదరాబాద్ వచ్చిన జార్ఖండ్ ఎమ్మెల్యేల పర్యవేక్షణను కాంగ్రెస్ నేతలే చూసుకుంటున్నారు. JMM కూటమి ఎమ్మెల్యేల కోసం లియోనియ రిసార్టులో 70 రూములను బుక్ చేశారు. సుమారు 39 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ రాగా…. సీఎం చంపై సోరెన్‌తోపాటు ముగ్గురు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలు శామీర్‌పేట్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్యాంపు ఏర్పాటు చేసింది.
జార్ఖండ్ ముక్తి మోర్చాతో కలిసి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నడుపుతోంది. బల నిరూపణ సమయంలో ఎమ్మెల్యేలు చీలకుండా క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి సమన్వయ బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్, దీపాదాస్ మున్షీ నిర్వహిస్తున్నారు. ఉదయం జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు ముగ్గురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే… బలనిరూపణ కోసం 10 రోజులు సమయం ఇచ్చారు గవర్నర్. అయితే… ఈనెల 5నే బలనిరూపణ చేసుకోవాలని చంపై సోరెన్ నిర్ణయించింది.
జార్ఖండ్ రాజధాని రాంచీలోని 12 ప్రాంతాల్లో హేమంత్ సోరెన్ 8.5 ఎకరాలు ఆక్రమించారనే అభియోగాలు నమోదయ్యాయి. మనీ ల్యాండరింగ్ కేసు కూడా నమోదైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఈడీ విచారణకు రావాలని సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్‌కు వరుసగా నోటీసులు పంపించింది. ఎన్ని నోటీసులు ఇచ్చినా హేమంత్ స్పందించకపోవడంతో ఇటీవల ఆయనను అరెస్ట్ చేసింది. దీంతో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజీనామాతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.













