పెళ్లి ఉక్రెయిన్ లో .. వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ లో
ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతుండగా ఉక్రెయిన్ దేశ వధువుతో హైదరాబాద్‌కు చెందిన ప్రతీక్‌తో వివాహం జరిగింది. ఉక్రెయిన్ యువతి ల్యూబోవ్ హైదరాబాద్‌కు చెందిన ప్రతీక్ గత కొంతకాలంగా ప్రేమలో పడ్డారు. ఈ జంటకు ఇటీవలే ఉక్రెయిన్‌లో వివాహమైంది. యుద్ధానికి ముందే పెళ్లి చేసుకున్న ఈ వధూవరులు రిసెప్షన్‌ను హైదరాబాద్‌లో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. వివాహం తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన ఈ కొత్త జంట హైదరాబాద్‌లో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లాలనుకున్న ఈ జంటకు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం ఆ దేశానికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కొన్నాళ్లపాటు హైదరాబాద్‌లో ఉండాలని నిర్ణయించారు. ఈ రిసెప్షన్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.













