కేసీఆర్ లో నిజంగా అంత పట్టుదల ఉంటే…
కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు మనం ఎప్పటినుండో చూస్తూనే ఉన్నాం. 2018 ఎన్నికలకు ముందు కూడా ఆయన కేంద్ర ప్రభుత్వం విషయంలో సీరియస్గా ముందుకు వెళ్లారు. 2019 ఎన్నికల తర్వాత మాత్రం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం సీఎం కేసీఆర్ విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నారు అనే వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా వినపడుతున్నాయి.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో బీజేపీ నాయకత్వం మొత్తం కూడా ఇప్పుడు సీరియస్ గానే దృష్టి పెట్టింది. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ ఒక వేళ కేంద్ర ప్రభుత్వంపై సీరియస్ గా ముందుకు వెళితే మాత్రం కచ్చితంగా ఆయన భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకుని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ తీరుపై చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రతిపక్షాల ముఖ్యమంత్రులు మిత్రపక్షాలు ముఖ్యమంత్రులు అందరూ కూడా బీజేపీ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడు ఇబ్బంది ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాబట్టి ప్రతిపక్షాల నాయకులు అందరు కూడా కలవాల్సిన అవసరం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి గా చెప్తున్న స్టాలిన్… అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ విజయం సాధిస్తే ఆమెతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, అలాగే కర్ణాటకలోని జేడీఎస్ అధినేత తో సీఎం కేసీఆర్ భేటీ కావాల్సిన అవసరం ఉంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆయన అభిప్రాయాలను కూడా స్వేచ్ఛగా చెప్పలేకపోతున్నారు అనే భావన ఉంది. కాబట్టి ఆయనతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి కొంతమంది కీలక నేతలతో కూడా సీఎం కేసీఆర్ చర్చలు జరిపి త్వరగా భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుని ముందుకు వెళితే ఇప్పటినుంచే ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే కేసీఆర్ వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు పడవచ్చు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ముఖ్య మంత్రులు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల ముఖ్యమంత్రులు అందరూ కూడా సీరియస్ గానే ఉన్నారు.
అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే ఆలోచన కేసిఆర్ కు ఉంటే మాత్రం ఇప్పటి నుంచి జాగ్రత్తపడి ముందుకు వెళ్లాలి.













