సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు.. అర్థరాత్రి ఒంటి గంట వరకు

హైదరాబాద్ నగరంలో వరుస హత్యలు, గొడవలతో పోలీసులు కొన్నాళ్లుగా కఠిన చర్యలు చేపట్టారు. నిబంధన ప్రకారం రాత్రి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు, హోటళ్ల కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశించారు. నిర్దేశించిన సమయాన్ని మించి కార్యకలాపాలు సాగించిన వారిపై కేసులు నమోదు చేశారు. అర్ధరాత్రి దాటాక రోడ్లపై ఇష్టానుసారం సంచరిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల తీరుపై వ్యాపార వర్గాలు, రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. శాసనసభలో సమావేశాల్లో ఇదే విషయం పలుమార్లు ప్రస్తావనకు రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు నగరంలో దుకాణాలు తెరిచే ఉండొచ్చంటూ వ్యాపార వర్గాలకు తీపికబురు చెప్పారు.