వైద్య పరికరాల ఉత్పత్తిలో ఇక్కడ హబ్ బేష్.. జాన్ అండర్సన్
వైద్య పరికారాల ఉత్పత్తిలో హైదరాబాద్ ముందువరుసలో ఉన్నదని అమెరికాకు చెందిన హార్లాండ్ మెడికల్ సిస్టం కంపెనీ సీఈవో జాన్ అండర్సన్ పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన బయో ఏషియా సదస్సు జాన్ అండర్సన్ హాజరయ్యారు. ఫార్మా రంగంలో టెక్నాలజీ, వైద్య పరికరాల ఉత్పత్తి, వినియోగం, మెడిటెక్ పెట్టుబడులపై ఆయన మాట్లాడారు. క్లస్టర్ల వారీగా ఫార్మా రంగం అభివృద్ధికి చేపడుతున్న ప్రణాళికలతో తెలంగాణ అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నదని తెలిపారు. భవిష్యత్తులో వైద్య రంగంలో సాంకేతికత వినియోగం ప్రాధాన్యం మరింత పెరుగుతుందన్నారు. వైద్య పరికరాల ఉత్పత్తిలో కీలకమైన మెడికల్ కోటింగ్ ప్రాసెస్ హైదరాబాద్ కేంద్రంగా విస్తరిస్తుందని తెలిపారు.













