టీఆర్ఎస్ చీఫ్ గా హరీష్ ఫైనల్…?
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారు అనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తూనే ఉన్నాయి. అయితే సీఎం కేసీఆర్ చేసే మార్పులు ఏ విధంగా ఉంటాయి ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేసే మార్పులు భారతీయ జనతా పార్టీని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటేనే మంచిది అనే భావన ఉంది.
ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోవడానికి అడుగులు వేస్తున్నారు. ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే మంచిదనే భావన లో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం దాదాపుగా అసాధ్యం అనే భావన ఉంది. హరీష్ రావు ని పక్కన పెడతారు అని భావించిన చాలా మంది నేతలు హైదరాబాద్, రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో పెద్దగా పని చేసే ప్రయత్నం చేయలేదు. అలాగే నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలో కూడా చాలామంది బయటకు వచ్చిన పరిస్థితి లేదు.
దీనితో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావం చూపించ లేకపోవచ్చు అనే ప్రచారం ఉంది. ప్రచారం విషయంలో మంత్రులు స్పీడ్ గా ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఆసక్తి చూపించలేదు. దీని కారణంగా పార్టీ క్షేత్రస్థాయిలో నష్టపోయింది. దీనితో సీఎం కేసీఆర్ ఇప్పటికే కొన్ని నివేదికలు కూడా తెప్పించుకున్నారట. హరీష్ రావు వర్గం ఎన్నికల్లో సైలెంట్ గా ఉంది అని ఆయన గ్రహించారు. 2014 ఎన్నికల్లో హైదరాబాద్ సహా మిగిలిన రెండు జిల్లాల్లో హరీష్ రావు కొంతమంది కీలక నేతలకు టికెట్లు ఇప్పించుకున్నారు.
2018 ఎన్నికలలో కూడా చిన్న చిన్న మార్పులు చేసి సీఎం కేసీఆర్ ఈ రెండు జిల్లాల్లో వాళ్ళకే సీట్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు హరీష్ రావు ని పక్కన పెడుతున్నారని భావిస్తున్న కొంతమంది కీలక నేతలు పార్టీలో సైలెంట్ గా ఉంటున్నారు. ఒకరిద్దరు మంత్రులు కూడా సైలెంట్ గానే ఉన్నారని తెలిసింది. అందుకే ఇప్పుడు వారిని ముందుకు తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ అనుకున్న విధంగా ప్రభావం చూపించ లేదు.
హరీష్ రావు ప్రచారం చేసిన ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ ఎక్కువగా ప్రభావం చూపించింది. కేటీఆర్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఎక్కువ స్థానాలు కోల్పోయింది. అందుకే హరీష్ రావు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అనే భావనలో కూడా కేసీఆర్ అన్నారు. అందుకే ముఖ్యమంత్రి పదవి విషయంలో కూడా ఆయన ఇప్పటికీ ఒక స్పష్టత ఇచ్చేసారు. నాయకులు కూడా ఎవరు మీడియాతో మాట్లాడవద్దని ఈ అంశం గురించి ఎక్కడా కూడా ప్రస్తావించి వద్దు అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇప్పటివరకు హరీష్ రావు పక్కన పెట్టాలని భావించిన నష్టాలు ఎక్కువగా ఉండటంతో కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు. అందుకే పార్టీ చీఫ్ ని చేస్తున్నారట.













