స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు : ఈటల
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేను అనుమతించేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరాకరించడంపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో తమకు కేటాయించిన సీట్లతో నిలబడితే సస్పెండ్ చేయడం అనైతికమని మండిపడ్డారు. సభా సంప్రదాయాలను మంటగలిపే విధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని వ్యాక్యానించారు. ఉద్యమాన్ని తూలనాడిన మంత్రితో ఉద్యమకారులను సస్పెండ్ చేయించటం దుర్గార్గమని అన్నారు. తనను తరిమి తమిరి కొడుతామన్న వ్యాఖ్యలను సీఎం మర్చిపోయినట్లున్నారని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారే బాద్యత మర్చిపోయి ప్రవర్తిస్తున్నారన్నారు.













