జాతీయ పార్టీ లేకుండా.. అది సాధ్యం కాదు
జాతీయ పార్టీ లేకుండా ప్రాంతీయ పార్టీల కూటమి సాధ్యం కాదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు సీఎం కేసీఆర్ ముంబయి పర్యటనకు వెళ్లారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో దాడులు తాత్కాలిక విజయాన్ని మాత్రమే ఇస్తాయని మంత్రి కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతాయని కేటీఆర్ చిల్లర వ్యాఖ్యలు చేశారు. వీఆర్వోలను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతోందన్నారు. ఉద్యోగ నియామకాలపై కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని ఉద్యోగాల భర్తీ లేక యువకులు వివాహం చేసుకోవడం లేదని ఆరోపించారు. గవర్నర్ తమిళిసైను మేడారంలో అవమాన పరిచారని మండిపడ్డారు. సంస్కార హీనమైన సంప్రదాయానికి సీఎం తెర తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారని గుర్తు చేస్తూ.. వ్యక్తులు కాదు, వ్యవస్థలు ముఖ్యమని అన్నారు.













