ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? : ఈటల
తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేయడానికి ఒక్క టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే అనుమతులుంటాయా అని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. జనగామలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లేందుకు సిద్దమైన ఈటలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దెబ్బలు తీన్న వారిపైనే పోలీసులు కేసుటు పెడుతున్నారని మండిపడ్డారు. గాయపడిన వారికి ధైర్యం చెప్పే స్వేచ్ఛ కూడా లేదా అని నిలదీశారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఒక్క టీఆర్ఎస్కేనా, ప్రజా సంఘాలు, ఇతర పార్టీలకు మాట్లాడే, నిరసన తెలిపే అధికారం లేదా అన్నారు. ఇచ్చిన తెలంగాణ గురించి మోదీ మాట్లాడారని, బీజేపీ మద్దతులోనే తెలంగాణ వచ్చిందని అన్నారు.













