ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఇదే తొలిసారి
వందేళ్ల ఉస్మానియా వర్సిటీ చరిత్రలో నూతన అధ్యాయమిది. ఆదివాసీ మహిళలు తలుచుకుంటే ఎందులోనూ, ఎవ్వరికీ తీసిపోరని ఆదివాసీ (కోయ) బిడ్డ డాక్టర్ గుమ్మడి అనురాధ నిరూపించారు. న్యాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకమైన తొలి ఆదివాసీ మహిళగా రికార్డును సాధించడమే కాకుండా తాజాగా లా కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. బషీరాబాగ్ లా కళాశాల ప్రిన్సిపాల్ ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుమ్మడి అనురాధ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంతటి ఉన్నత ఉద్యోగాన్ని నిర్వహిస్తున్న ఏకైక ఆదివాసీ మహిళ అనురాధ కావడం విశేషం. ఉస్మాని వర్సిటీ వందేళ్ల చరిత్రలో తొలిసారి ఒక ఆదివాసి (కోయ) మహిళ లా కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈమె ఎవరో కాదు ఐదుసార్లు ఇల్లందు ఎమ్మెల్యేగా ఎన్నికైన గుమ్మడి నర్సయ్య కుమార్తెనే.













