భద్రాచల రామునికి ఎన్నారై వాసవి అసోసియేషన్ ఉత్సవ వాహనాల విరాళం
ప్రవాస భారతీయ వాసవీ సంఘం (ఎన్నారై విఎ) ఆధ్వర్యంలో భద్రాచల దేవస్థానానికి 12 నూతన ఉత్సవ వాహనాలను విరాళంగా అందజేస్తున్నట్లు ఎన్నారై విఎ అధ్యక్షుడు శ్రీనివాసరావు పందిరి తెలిపారు. ఈ కార్యక్రమం మార్చి 3వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్నది. దేవస్థానం వారు ఆ రోజంతా ఎన్నో ఉత్సవాలను ఏర్పాటు చేసి ఆనాటి సాయంత్రం 5 గంటల నుండి 12 వాహనాలపైన తిరువీధి సేవ చేయడంతో ముగుస్తుంది. ఈ చారిత్రాత్మకమైన ఘట్టాన్ని వీక్షించడానికి ఎన్నారై విఎ, సభ్యులను, నిర్వాహకులను ఆలయ పరిపాలకులు ఆహ్వానించారు. సభ్యులు, ప్రాజెక్ట్ సమన్వయకర్తలు, సభ్యుల కుటుంబ వ్యక్తులు ఈ దివ్యమైన వేడుకకు హాజరుకావాలని ఆయన కోరారు. 360 సంవత్సరాల పాత వాహనాల్ని మార్చి ఈ కొత్త వాహనాల్ని భద్రాచల దేవస్థానానికి సమర్పించడం సంస్థ చరిత్రలో ఒక మైలురాయిగా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇందుకోసం 75 లక్షల రూపాయల విరాళాన్ని సభ్యుల నుండి సేకరించడం జరిగిందన్నారు. మొత్తం ప్రాజెక్ట్ కేవలం 8 నెలలకాలంలోనే ముగించి 50 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే శ్రీ రామ పట్టాభిషేక మహోత్సవానికి సిద్ధం చేసి ఇచ్చినట్లు తెలిపారు.
దాతలకు, ఛాప్టర్ లీడ్స్ కు, కమిటీ టీంలకు, రీజినల్ డైరెక్టర్లుకు,, ప్రపంచ వ్యాప్త వాలంటీర్లకు, భద్రాచలం దేవస్థానం పరిపాలక బృందానికి, మరియు అలుపెరుగక పని చేసి ముఖ్య భూమికను వహించిన అర్చకులకు, వాహనాలు తయారు చేసిన శ్రీ రాజ శిల్పాలయవారికి, మిషన్ 20 వన్ లీడర్షిప్ టీంకు, 6వ గ్లోబల్ కన్వెన్షన్ లీడర్ షిప్ టీంకు ఈ కల సాకారమవ్వడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. రంగ శ్రీరామ్, వారి కుటుంబ సభ్యులు, డా. ఎస్ఎల్. కాంత రావు, ఎస్. రామారావుకు వారి సేవకు, అడుగడుగునా వారు కనబరిచిన శ్రద్ధకు కృషికి మా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమాన్ని లింక్ ద్వారా కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.













