తెలంగాణలో 1551కి చేరిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 42 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా జీహెచ్ఎంసీ (హైదరాబాద్) పరిధిలో 37 కాగా, రంగారెడ్డి జిల్లాలో 2, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వలస జీవుల కేసులు 2 నమోదయ్యాయి. దీంతో వలసల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 57కు పెరిగింది. మొత్తంగా రాష్ట్రంలో నాటికి కరోనా బాధితుల సంక్య 1551కి చేరుకుంది. ప్రస్తుతం అసుపత్రుల్లో 525 మంది చికిత్స పొందుతుండగా అదివారం మరో 42 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఆరోగ్యమంతులుగా ఇళ్లకెళ్లినవారి సంఖ్య 992కు చేరింది. ఇప్పటివరకూ మహమ్మారి బారినపడి 34 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాని జిల్లాలు వరంగల్ గ్రామీణ, యాదాద్రి భువనగిరి, వనపర్తి కాగా గత 14 రోజులుగా పాజిటివ్ కేసులు నమోదవని జిల్లాలు 25 ఉన్నాయి. పెద్దసంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది వలసలు వస్తుండటంతో, ప్రభుత్వం వారిని పరీక్షించడానికి అన్ని చర్యలు తీసుకుందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు.













