తెలంగాణలో 1082కు పెరిగిన కేసులు
తెలంగాణలో ఆదివారం మరో 21 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1082కు పెరిగింది. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 20, జగిత్యాల జిల్లాలో ఒకటి నమోదైంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 508 మంది బాధితులు చికిత్స పొందుతుండగా ఆదివారం 46 మంది కోలుకుని ఇళ్లకెళ్లారు. మొత్తంగా చికిత్స పొంది డిశ్చార్జి అయినవారి సంఖ్య 545కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 29 మంది మృతిచెందారు. గత రెండు వారాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాని జిల్లాల్లో తాజాగా వికారాబాద్, నల్గొండ జిల్లాలు చేరడంతో.. ఆ జాబితాలో మొత్తం సంఖ్య 17కు చేరింది.














