తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా… అభిషేక్ మను సింఫ్వీు

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఫ్వీు ని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కె.కేశవరావు రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. రాజ్యసభలోని 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది.
సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, కామఖ్య ప్రసాద్ తస (బీజేపీ), మీసా భారతి (ఆర్జేడీ), వివేక్ ఠాకుర్ (బీజేపీ), దీపేంద్రసింగ్ హుడా (కాంగ్రెస్), ఉదయన్ రాజే భోస్లే (బీజేపీ), కె.సి.వేణుగోపాల్ (కాంగ్రెస్), బిప్లబ్ కుమార్ దేబ్ (బీజేపీ) లోక్‌సబకు ఎన్నికయ్యారు. వారి రాజీనామాలతో రాజ్యసభలో ఖాళీలు ఏర్పడాయి.