ఒంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్పై గజ్వేల్ నియోకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి అపజయం పాలైన ఒంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై విమర్శల వర్షం కురిపించిన ఒంటేరు, కాంగ్రెస్ ను వీడి, ఇప్పుడు టీఆర్ఎస్లో చేరనున్నట్టు సమాచారం. కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువాను ఆయన కప్పుకోనున్నారు. రేపు నిర్వహించే ఓ కార్యక్రమంలో ఒంటేరుకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి కేసీఆర్ ఆహ్వానించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, 2014 ఎన్నికల్లో సైతం గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. ఒంటేరు టీఆర్ఎస్లో చేరడంతో గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టుయింది.













