హరికృష్ణ భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులు
సినీ నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. మసాబ్‌ట్యాంకులోని హరికృష్ణ నివాసానికి ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు చేరుకున్నారు. కేసీఆర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హరికృష్ణ నివాసంలోకి తీసుకెళ్లారు. అనంతరం హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పరామర్శించారు. హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివస్తున్నారు.













