హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ కు ఘనంగా వీడ్కోలు
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం అయిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు తెలంగాణ హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొదటి కోర్టు హాల్లో జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు బార్ అసోసియేషన్ ఉజ్జల్ భూయాన్‌ను సత్కరించింది. 2022 జూన్ 28 నుంచి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా భూయాన్ కొనసాగుతున్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ భూయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టి పదోన్నతి పొందిన సంగతి తెలిసిందే.













