ఫిబ్రవరిలో బయో ఆసియా సదస్సు
లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రధాన కేంద్రంగా తెలంగాణకు ప్రపంచ స్థాయి గుర్తింపు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి17-20 మధ్య కాలంలో హైదరాబాద్‌లో బయో ఆసియా- 2020 17వ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సదస్సులో 50 దేశాలకు చెందిన 2 వేల మంది జీవశాస్త్ర నిపుణులు, ఫార్మా సంస్థల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. బయో ఆసియా 2020 సదస్సు నిర్వహణలో భాగస్వామ్యం, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో వ్యాపార విధానాలు, సాంకేతిక పరిజ్ఞానంపై పరస్సర సహకారానికి సంబంధించి ఒప్పందాలపై కేటీఆర్ సమక్షంలో స్విట్జర్లాండ్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ సిల్వనా రెంగ్లీ ఫ్రే, తెలంగాణ అధికారుల మధ్య సంతకాలు జరిగాయి. లైఫ్ సైన్సెస్ సదస్సును టుడే ఫర్ టుమారో నినాదంతో నిర్వహిస్తామని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు.













