బసవ తారకంలో కొవిడ్ సేవలు భేష్..

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు చికిత్సను అందిస్తున్న వైద్య బృందం, ఎమర్జెన్సీ కేర్ వైద్యులను చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభినందించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్మిస్తున్న నూతన వార్డు పనులను బాలయ్య పరిశీలించారు. డాక్టర్ ఎల్‍ఎం చంద్రశేఖరరావు, ఇతర వైద్య సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో సేవలందించాలని విజ్ఞప్తి చేశారు. నూతన వార్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయటానికి ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.