మంత్రి కేటీఆర్ చొరవతో హౌజ్ సర్జన్లకు స్టైఫండ్ పెంపు

తెలంగాణలోని హౌజ్ సర్జన్లు, పీజీ వైద్యులకు సీఎం కేసీఆర్ భారీ ఊరటనిచ్చారు. హౌజ్ సర్జన్, పీజీ వైద్యుల స్టైఫండ్ 15 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ వైద్య శాఖ కార్యదర్శికి ఆదేశాలివ్వగా, వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కేటీఆర్‌కు ట్వీట్ చేసిన వైద్యురాలు
‘‘సార్… ఈ కష్టకాలంలో ఎందరికో సాయం చేస్తున్నారు. కానీ రెసిడెంట్ డాక్టర్లు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ నిరంతరం సేవలందిస్తున్నారు. అయితే 4 నెలలుగా మాకు జీతాలు రావడం లేదు. కోవిడ్ డ్యూటీలకు హాజరైన వారికి మాత్రం ప్రోత్సహకాలిస్తున్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో మేమెలా పని చేయగలం?’’ అంటూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.
ఆ వైద్యురాలు చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. హౌజ్ సర్జన్లు, పీజీ వైద్యుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టి్కి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అన్నట్టే మంత్రి కేటీఆర్ ఈ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారికి 15 శాతం స్టైఫండ్ పెంచాలని ఆరోగ్య శాఖ కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని, ఇవాళ జీవో విడుదల అవుతుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.