12 పద్దులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 12 పద్దులను ఆమోదించారు. సమాచార`పౌర సంబంధాల శాఖ, పరిశ్రమలు-వాణిజ్య శాఖ, ఐటీ-ఎలక్ట్రానిక్స్ -కమ్యూనికేషన్స్ శాఖ, పురపాలక-పట్టణాభివృద్ధి శాఖ, కార్మిక-ఉపాధి కల్పన శాఖ, దేవాదాయ శాఖ, అటవీ-పర్యావరణ శాఖ, న్యాయశాఖ, విద్యుత్తు, పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యకు సంబంధించిన పద్దులపై సభ చర్చించి, ఆమోదించింది. వివిధ కులాలను ఎస్టీల్లో చేర్చడంపై సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానంతో పాటు కుమ్రం భీం ఆసిఫాబాద్ను మున్సిపాలిటీగా మారుస్తూ మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.













