కార్తీ చిదంబరం అమెరికా పర్యటన
ఎయిర్సెల్, మ్యాక్సిస్ అక్రమ లావాదేవీల కేసులో విచారణ ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరం అమెరికా వెళ్లి వచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కుమార్తెను కళాశాలలో చేర్పించేందుకు సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు కార్తీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. విదేశీ పర్యటన విషయంలో ఇంతకు ముందు విధించిన నియమ నిబంధనలను పాటించాలని కార్తీకి సూచించింది. కాగా విదేశీ పర్యటన కోసం ధర్మాసనం ఇచ్చిన స్వేచ్ఛను కార్తీ దుర్వినియోగం చేస్తున్నారనీ, తమ దర్యాప్తు ఆలస్యం చేస్తున్నారనీ ఈడీ నిన్న సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించింది. మరోవైపు కార్తీకి మంజూరు చేసిన మధ్యంత బెయిల్ రద్దు చేయాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఢిల్లీలోని పటియాలా హైకోర్టు ఈనెల 25 వరకు వాయిదా వేసింది.













