విశాఖ – కొలంబో మధ్య విమాన సర్వీసులు
విశాఖపట్నం నుంచి శ్రీలంక దేశ రాజధాని కొలంబోల మధ్య జులై 8వ తేదీ నుంచి విమాన సర్వీసులు ప్రవేశపెడుతున్నట్లు శ్రీలంక ఎయిర్లైన్స్ మేనేజర్ సంజీవ జయతిలకే వెల్లడించారు. విశాఖలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కొత్త రూట్ కోసం ఎయిర్ బస్ 300/321 ఎయిర్ క్రాఫ్ట్ను కొత్తగా ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు శ్రీలంక, ఎయిర్లైన్స్ భారతదేశంలో న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూర్, కొచ్చిన్, మదురై, త్రివేండ్రం, తిరుచునాపల్లి, వారణాశి, బోధ్గయాల నుంచి కొలంబోకు విమాన సర్వీసులు నడుపుతున్నదన్నారు. రాను పోను ఒక్కో ప్రయాణికునికి టికెట్ ఫేర్ రూ.14,999 అని చెప్పారు.













