సైనాకు స్వర్ణం… సింధుకు రజతం
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్టే నగరంలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలకు ఆదివారం తెరపడింది. ఏప్రిల్ 4న ప్రారంభమైన ఈ క్రీడలు ఆదివారం ఘనంగా ముగిసాయి. ఈ క్రీడల్లో భారత క్రీడాకారులు అసాధారణ ప్రతిభను కనబరిచి ఏకంగా 26 స్వర్ణాలు సొంతం చేసుకున్నారు. ఆదివారం క్రీడల చివరి రోజు భారత్ మరో స్వర్ణం సాధించింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో తెలుగుతేజం సైనా నెహ్వాల్ స్వర్ణం గెలుచుకొంది. కిదాంబి శ్రీకాంత్, పి.వి.సింధు లు రజతాలు సాధించారు. ఈ క్రీడల్లో భారత్ 26 స్వర్ణాలు, 20 రజతాలు, మరో 20 కాంస్య పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఆదివారం జరిగిన ముగింపు వేడుకల్లో బాక్సింగ్ దిగ్గజం భారత బృందానికి సారథ్యం వహించింది.













