సైనా, కశ్యప్ పెళ్లి ప్రతిక ఇదేనా?
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుణి సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్వప్ పెళ్లికి సంబంధించిన ఓ వివాహ పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్లో మాదాపూర్లోని నొవాటెల్ హోటల్లో వచ్చే నెల 16వ తేదీన సాయంత్రం 7 గంటలకు ఈ ఇద్దరి వివాహం జరగనున్నట్లు ఆ పత్రికలో ఉంది. 2018 డిసెంబర్ 16న సైనా నెహ్వాల్, కశ్వప్ మూడు మూళ్లతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సైనానే ప్రకటించారు. 2005 నుంచి బ్యాడ్మింటన్లో శిక్షణ తీసుకుంటున్న టైంలో పరిచయం ఏర్పడిందని, అది పెళ్లికి దారితీసిందని సైనా ఇటీవల ప్రకటించారు. కెరీర్ కోసమే పెళ్లిని చాలా కాలం నుంచి వాయిదా వేస్తూ వచ్చామని ఆమె చెప్పారు. తమ ప్రేమ గురించి తల్లిదండ్రులే తెలుసుకున్నారని సైనా పేర్కొన్నారు.













