త్వరలో కొత్త రూ.20 నోట్లు
పెద్ద నోట్ల చలామణీ రద్దు అనంతరం మార్కెట్లో కొన్ని చిన్న నోట్ల కొరతకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) క్రమక్రమంగా చెక్ పెడుతోంది. తాజాగా త్వరలో మహాత్మా గాంధీ సీరిస్ 2005లో కొత్త రూ.20 బ్యాంకు నోట్లను మార్కెట్లోకి తీసుకున్నాన్నట్టు ఆర్బిఐ తెలిపింది. ఈ కొత్త నోట్లు నంబర్ ప్యానల్ ఎస్ అనే ఇన్సెట్ లెటర్‌ను కలిగి ఉండి, ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో మార్కెట్లోకి విడుదల చేస్తామని ఆర్బిఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. రెండు నంబర్ ప్యానల్స్‌లోనూ ఇన్సెట్ లెటర్ ఎస్ ఉంటుందని ఆర్బిఐ తెలియజేసింది. ఈ నోట్లు ఇప్పుడు మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.20 నోట్ల మాదిరి డిజైన్‌నే కలిగి ఉండనున్నాయని తెలిపింది. అంతకు ముందు తాము జారీ చేసిన 20 రూపాయల నోట్లను కూడా చట్టబద్ధమైనవిగానే కొనసాగిస్తామని ఆర్బిఐ తెలిపింది.













