తమతో కలిస్తే ఆయన సీఎం
ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలగడంపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నుంచి వైదొలిగే విషయంలో ముఖ్యమంత్రి తొందరపాటుగా వ్యవహరించారని, కొనసాగి ఉంటే హోదాపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించేవారని అన్నారు. జగన్‌ను తాము ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నామని, తమతో కలిస్తే ఆయన సీఎం అయ్యేందుకు సహకరిస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో మోదీ, అమిత్‌షాలతో తాను మాట్లాడతానని చెప్పారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. రాజ్యాంగాన్ని తానూ, మోదీ రక్షిస్తామని, కాంగ్రెస్ పార్టీని ఆయన రక్షించుకోవాలని సలహా ఇచ్చారు.













