అమెరికా రాయబారితో రాహుల్ భేటీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్కు అమెరికా రాయబారి కెన్నెత్ జస్టెర్, దక్షిణ మరియు మధ్య ఆసియాకు అమెరికా హోమ్ శాఖ యాక్టింగ్ అసిస్టెంట్ సెక్రటరీ అలీస్వెల్స్తో సమావేశమయ్యారు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ వారితో కలిసి ఉన్న ఫొటోను రాహుల్ ట్వీట్ చేశారు. సమావేశంలో ద్వైపాక్షిక ప్రయోజనం, ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై విస్తృతమైన రీతిలో అభిప్రాయాలను ఇచ్చి పుచ్చుకున్నామని ఆయన తన ట్వీటర్ ఖాతాలో పేర్కొన్నారు. అయితే ద్వైపాక్షిక సంబంధాలు, ఉగ్రవాదం, తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ గాంధీతో పాటు సమావేశానికి హాజరై కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో అభిప్రాయాలను ప్రయోజనపూర్వకంగా ఇచ్చిపుచ్చుకున్నట్లు తెలిపారు. సమావేశం అర్ధగంటకుపైగా జరిగినట్లు సమాచారం.













