అప్పుడు ఒక్కడినే… ఇప్పుడు 20 లక్షలు
జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. మూడేళ్ల ప్రయాణాన్ని ఉద్దేశిస్తూ చేసిన ఈ ట్వీట్ లో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మూడేళ్ల క్రితం జనసేన ప్రయాణం మొదలు పెట్టినప్పుడు, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, దైర్యమే కవచంగా ఒకే గొంతుకతో మొదలుపెట్టాను. నేను స్పందించిన ప్రతి సమస్యకీ మేమున్నామంటూ ప్రతి స్పందించి, ఈ రోజు 20లక్షల దీపాలతో దారంతా వెలుగులు నింపిన మీ అభిమానానికి శిరసు వంచి కృతజ్ఞలతో మీ పవన్‌కల్యాణ్ అని పేర్కొన్నారు. ఆయన ట్విట్టర్ ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య తాజాగా 20 లక్షలు దాటింది. దానిని ఉద్దేశించే 20 లక్షల దీపాలు అని పేర్కొన్నారు.













