రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రదానం
రాష్ట్రపతి భవన్లో పద్మశ్రీ అవార్డుల ప్రదాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మ అవార్డు గ్రహితలు పురస్కారాలను అందుకున్నారు. డాక్టర్ సుబ్రోతో దాస్, జితేంద్రనాథ్ గోస్వామి, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, రెజ్లర్ సాక్షి మాలిక్, పండిట్ విశ్వ మోహన్ భట్, సంజీవ్ కపూర్, డిస్కస్ త్రోవర్ వికాస్ గౌడ, మరియప్పన్ తంగవేలు పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్, కేజే ఏసుదాసు పద్మ విభూషణ్ అవార్డులను అందుకున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్‌జైట్లీతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ ఏడాది పద్మ పురస్కారాలకు 89 మందిని ఎంపిక చేయగా మార్చి 30న రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రప్రతి ప్రణబ్‌ముఖర్జీ 39 మందికి పురస్కారాల్ని అందజేశారు.













