అయోధ్యలో మందిరాన్ని నిర్మించి తీరుతాం..
అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరాన్ని నిర్మించాలే తప్ప మరో ‘కట్టడం’ అనే ప్రస్తావన ఉండరాదని రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ (ఆరెస్సెస్) అధినేత మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఇక్కడ శుక్రవారం ప్రారంభమైన ‘్ధర్మ సంసద్’లో ఆయన మాట్లాడుతూ, అయోధ్యలో మందిరానికి తప్ప మరో కట్టడానికి అవకాశం లేదన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు రెండు వేల మంది హిందూ సన్యాసులు, మఠాధిపతులు, విశ్వహిందూ పరిషత్ నాయకులు ‘్ధర్మ సంసద్’లో పాల్గొంటున్నారు. అయోధ్యలో మందిరం నిర్మాణంపై ఎలాంటి సందిగ్థత ఉండరాదని భగవత్ తన వాదాన్ని బలంగా వినిపించారు. ‘మందిరాన్ని నిర్మించి తీరుతాం.. ఇది ప్రచారం కోసం కాదు.. హిందువుల విశ్వాసానికి సంబంధించిన అంశం.. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు..’ అని ఆయన తేల్చిచెప్పారు.













