త్వరలో రూ.200 నోట్లు!
భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలో రూ.200 నోట్లను తీసుకురానుంది. గత నెలలో జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం దీనికి అనుమతి ఇస్తే జూన్ తరువాత నుంచి వీటి ముద్రణ ప్రారంభం కానుందని వెల్లడించింది. నోట్ల రద్దు అనంతరం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నా అవి అనుకున్నంత మేరకు లేకపోవడం, చిన్న నోట్ల కొరత కొనసాగుతుండడంతో రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై వ్యాఖ్యానించడానికి రిజర్వు బ్యాంకు అధికార ప్రతినిధి నిరాకరించారు.













