పాస్‌పోర్టు మరింత సరళతరం
పాస్‌పోర్టు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే వారు సమర్పించాల్సిన ధ్రువపత్రాల విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల పలు సడలింపులను ఇచ్చింది. ఇప్పటివరకూ జనన ధ్రువీకరణకు ఎస్ఎస్సీ సర్టిఫికెట్ లేదా పంచాయతీ లేదా మున్సిపాలిటీలు ఇచ్చిన పత్రాలు మాత్రమే చెట్లుబాటయ్యేది. ఇకపై ఆ అవసరం లేదు. ఆధార్, ఓటర్ కార్డులోని పుట్టిన తేదీలను పరిగణనలోకి తీసుకుంటారు. భార్యభర్తలు విడాకులకు దరఖాస్తు చేసుకుని పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే విధిగా భాగస్వామి పేరు రాయల్సి వచ్చేది. ఇప్పుడు ఆ నిబంధనను కూడా సడలించారు. ఇప్పటికే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. నిబంధనలు సరళతరం వల్ల దరఖాస్తు దారుల సంఖ్య పెరగొచ్చని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పాస్‌పోర్ట్ కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు.













