వై ఏపీ నీడ్స్ జగన్.. షురూ…!
రాష్ట్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా అధికార వైసీపీ అడుగులు వేస్తోంది. విపక్షాల కౌంటర్లకు సమాధానమిస్తూ వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.. గురువారం నుంచి ఈ కార్యక్రమాన్ని గ్రామగ్రామాన నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఈప్రభుత్వం సంక్షేమం తప్ప, అభివృద్ధి చేపట్టడం లేదని.. తాము అధికారంలోకి వస్తే అభివృద్ధికి బాటలువేస్తామని టీడీపీ, జనసేన కూటమి ప్రకటించింది. దీంతో సంక్షేమమే.. అభివృద్ధి అని ప్రభుత్వం భావిస్తోందన్న అంశాన్నిప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికు రచించింది వైసీపీ ప్రభుత్వం.
ముఖ్యంగా సచివాలయాల ద్వారా జరిగిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచి.. తాము ఏం చేశామన్నది ప్రజలకు చూపిస్తామంటోంది వైసీపీ సర్కార్. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయంటోంది.న్నారు. 2019లో ఏపీ జీఎస్డీపీ 22వ స్థానం కాగా.. 2021-22లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల తెలిపారు. విద్య, వైద్యానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పించిందని చెప్పారు.
త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో… పూర్తిస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని ప్రజల్లో ఉంచాలని సీఎం జగన్ భావిస్తున్నారు . దీనిలో భాగంగా ఇప్పటికే సామాజిక సాధికారయాత్రను మంత్రులు,ఇతర నేతలతో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలను దగ్గర చేసుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.ఆయా ప్రాంతాలకు వెళ్తున్న మంత్రులు..స్థానికంగా తాము చేసిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ… చంద్రబాబు పాలనలో జరిగిన అన్యాయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. అంతేకాదు.. త్వరలోనే డోర్ టు డోర్ క్యాంపెయిన్ మొదలుపెట్టనున్నారు
మరోవైపు విశాఖ నుంచిపాలనను మొదలుపెడతామని ఇప్పటికే ప్రకటించిన సీఎం జగన్.. ఆదిశగానూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విశాఖలో పరిపాలన కార్యాలయం సిద్ధం చేయడంతోపాటు మంత్రుల కార్యాలయాలు సిద్ధమవుతున్నాయి. అధికారులు సైతం.. తాము పనిచేయాల్సిన చోట.. ఇళ్లు, ఇతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దీంతో సాగరతీరం కాస్తా.. ఎగ్జిక్యూటివ్ హంగుల్ని సంతరించుకుంటోంది. దీంతో ఉత్తరాంధ్రులకు దగ్గరయ్యేలా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.













