Parliament: పార్లమెంట్ లో రూమ్ నెంబర్ 11 కేటాయింపు పై.. వైసీపీ అభ్యంతరం
పార్లమెంట్ (Parliament)లో వైసీపీకి మొదటి అంతస్తులోని 11వ నెంబర్ రూమ్‌ను స్పీకర్ ఓం బిర్లా (Om Birla) కేటాయించారు. దీనిపై పార్టీ ఎంపీలు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. రూమ్ వెంటనే మార్చాలని స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు స్పీకర్ 12వ రూమ్ కేటాయించారు. గత అసెంబ్లీ (Assembly) ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొదటి అంతస్తులో 9వ నెంబర్ రూమ్‌ను టీడీపీకి కేటాయించారు. స్పీకర్ కార్యాలయం పాత భవనం నుంచి పార్టీ ఆఫీసులను ఖాళీ చేయించి కొత్త భవనంలో రూమ్‌లు కేటాయిస్తోంది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








