ప్రధాని మోదీతో వైఎస్ఆర్ ఎంపీల భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో వైఎస్ఆర్సీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్లమెంటు ప్రాంగణంలోని ప్రధాని కార్యాలయంలో ఆయనతో లోక్‌సభలో వైఎస్ఆర్సీపీ చీఫ్ విఫ్ మార్గాని భరత్‌రామ్ నేతృత్వంలో ఎంపీలు వంగా గీత, చింతా అనూరాధ, బి.వి.సత్యవతి, గొడ్డేటి మాధవి సమావేశమయ్యారు. ఓబీసీల జాబితా రూపకల్పన బాధ్యత రాష్ట్రాలకు అప్పగిస్తూ పార్లమెంటులో బిల్లు పాస్ కావడంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాలకు బాధ్యత అప్పగించడం వల్ల వెనకబడిన అనేక కులాలకు న్యాయం జరుగుతుందని ఎంపీ భరత్‌రామ్ పేర్కొన్నారు.













