జమ్మూ కాశ్మీర్లో టీటీడీ ఆలయం
కాశ్మీర్‌కు ఆంధప్రదేశ్ పర్యటక రంగానికి అనుసంధానం చేయడం శుభపరిణామం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడలో జరిగిన జమ్మూకాశ్మీర్ టూరిజం, కల్చర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ పెట్టుబడులకు అనువైన ప్రాంతమన్నారు. సింగిల్ విండొ విధానం ద్వారా టూరిజానికి అన్ని అనుమతులు సులభతరం చేశామని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం టూరిజానికి పెద్ద పీట వేస్తోందని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాశ్మీర్ టూరిజానికి రాష్ట్రంలో అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.













