2021లో ఎన్నికలు జరిగితే… బెదిరింపులతో ఏకగ్రీవాలు చేయలేదా? : బొండా ఉమ
ఎలాగైనా ఎన్నికలు జరగకుండా చేయాలన్నదే వైసీపీ (YSRCP)కుట్ర అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ (Bonda Uma) ఆరోపించారు. అందుకే అభ్యర్థుల చేతిలో నామినేషన్లు లాక్కొని చించేశారని మండిపడ్డారు. విధ్వంసం వాళ్లు షృష్టించి, ఆ నెపం టీడీపీ (TDP) పై పెడుతున్నారని ఆక్షేపించారు. పుంగనూరు(Punganur) తోపాటు చాలా చోట్ల వైసీపీ విధ్వంసానికి పాల్పడిందని మండిపడ్డారు. 2021లో వైసీపీ హయాంలో ఎన్నికలు జరిగితే, అడ్డగోలుగా బెదిరింపులతో ఏకగ్రీవాలు చేయలేదా? అని ప్రశ్నించారు. దౌర్జన్యాలు, హత్యా రాజకీయాలతో ఎంతమందిని బెదిరించారో ప్రజలందరికీ తెలుసన్నారు. మాచర్లలో తనపైనా హత్యాయత్నం చేశారని, భగవంతుడి ఆశీస్సులు ఉండబట్టి బయటపడ్డానని తెలిపారు.








